Sat Apr 05 2025 15:41:11 GMT+0000 (Coordinated Universal Time)
ఎంసెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల
తెలంగాణలో ఎంసెట్ పరీక్షలకు ఈ నెల 28వ తేదీన నోటిఫికేషన్ వెలువడనుంది.

తెలంగాణలో ఎంసెట్ పరీక్షలకు ఈ నెల 28వ తేదీన నోటిఫికేషన్ వెలువడనుంది. వచ్చే నెల 3వ తేదీ నుంచి ఎంసెట్ దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఎంసెట్ పరీక్షల నిర్వహణకు తెలంగాణ సాంకేతిక విద్యాశాఖ షెడ్యూల్ ను ప్రకటించింది. ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తయిన వెంటనే ఎంసెట్ పరీక్షలను నిర్వహించనున్నారు.
ఈ నెల28వ తేదీన...
ఈ నెల 28వ తేదీన ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. మే 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకూ తెలంగాణలో ఇంజినీరింగ్ కు సంబంధించి పరీక్ష జరగనుంది. మే 10, 11 తేదీల్లో అగ్రికల్చర్, మెడిసన్ కు సంబంధించి పరీక్షలు జరగనున్నాయి. వచ్చే నెల 3నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు.
Next Story