Mon Dec 23 2024 01:07:55 GMT+0000 (Coordinated Universal Time)
రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలు బంద్
శ్రీ చైతన్య కళాశాల ఘటనపై ఎన్ఎస్యూఐ స్పందించింది. రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలను గురువారం బంద్ చేయాలని నిర్ణయించింది
నార్సింగిలోని శ్రీ చైతన్య కళాశాల ఘటనపై ఎన్ఎస్యూఐ స్పందించింది. రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలను గురువారం బంద్ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఎన్ఎస్యూఐ పిలుపు నిచ్చింది. నార్సింగిలోని శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న సాత్విక్ బలన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే.
సాత్విక్ బలవన్మరణానికి నిరసగా...
సాత్విక్ బలవన్మరణానికి పాల్పడటానికి శ్రీ చైతన్య విద్యాసంస్థల యాజమాన్యమే కారణమని ఎన్ఎస్యూఐ నేతలు ఆరోపిస్తున్నారు. సాత్విక్ కుటుంబాన్ని ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సాత్విక్ మృతికి నిరసనగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా శ్రీ చైతన్య కళాశాలలను బంద్ చేయాలంటూ వారు పిలుపునిచ్చారు.
Next Story