Mon Dec 23 2024 02:13:59 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : మంత్రి పొంగులేటి కార్యాలయంపై ఈడీ దాడులు
మంత్రి పొంగులేటి శ్రీనివాసులురెడ్డి కార్యాలయాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాసులురెడ్డి కార్యాలయాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో పదహారు చోట్ల ఈ దాడులను నిర్వహిస్తున్నారు. తెలంగాణలో జరుగుతున్న ఈడీ దాడులు కంత కలకలం రేపుతున్నాయి. మంత్రి పొంగులేటి బంధువులు, సన్నిహితుల ఇళ్లలో కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
పదహారుచోట్ల...
ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఈ దాడులు చేస్తున్నారు. గతంలో ఎన్నికల సమయంలోనూ పొంగులేటి వ్యాపారాలపై ఈడీ అధికారులు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. మరోసారి ఈ దాడులు నిర్వహిస్తుండటం కేవలం కక్షసాధింపు చర్యల్లో భాగమేనని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఈడీ అధికారులు మంత్రి కార్యాలయం, ఇంట్లోనూ దాడులు చేస్తున్నట్లు తెలిసింది.
Next Story