Mon Dec 23 2024 11:18:04 GMT+0000 (Coordinated Universal Time)
KTR : రక్షాబంధన్ రోజు సోదరి కవితను గుర్తు చేసుకున్న కేటీఆర్
రక్షాబంధన్ రోజున సోదరి కల్వకుంట్ల కవితను గుర్తు చేసుకుని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భావోద్వేగానికి గురయ్యారు.
రక్షాబంధన్ రోజున సోదరి కల్వకుంట్ల కవితను గుర్తు చేసుకుని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. ప్రతి ఏటా క్రమం తప్పకుండా తనకు రాఖీపౌర్ణమి రోజున తనకు కవిత రాఖీ కట్టేదని ఆయన జ్ఞప్తికి తెచ్చుకున్నారు. ఈ రాఖీ పండగకు కవిత జైలులో ఉండటంతో కేటీఆర్ కొంత ఆవేదన చెందారు.
ట్వీట్ చేసి..
ఈ ఏడాది తన సోదరి కవిత తనకు రాఖీ కట్టలేకపోవచ్చు కానీ, ఆమెకు ఏ కష్టమొచ్చినా తాను ఎల్లకాలం అండగా ఉంటానని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈరోజు నువ్వు రాఖీని కట్టలేకపోవచ్చని, కానీ నీకు ఏ కష్టమొచ్చినా అండగా ఉంటానని ఆయన ఎక్స్ లో పోస్టు చేశారు. గతంలో కవిత తనకు రాఖీ కట్టిన ఫొటోను షేర్ చేశారు. తెలంగాణ భవన్ లో కేటీఆర్ కు పలువురు బీఆర్ఎస్ కు చెందిన మహిళలు రాఖీ కట్టారు.
Next Story