Wed Jan 15 2025 12:37:28 GMT+0000 (Coordinated Universal Time)
Womens day: తెలంగాణ ప్రభుత్వం కానుక
మహిళ దినోత్సవం సందర్భంగా తెలంగాణలోని స్వయం సహాయక బృందాలకు వడ్డీలేని రుణాల నిధులను విడుదల చేయనుంది.
మహిళ దినోత్సవం సందర్భంగా తెలంగాణలోని స్వయం సహాయక బృందాలకు వడ్డీలేని రుణాల నిధులను విడుదల చేయనుంది. మొత్తం 750 కోట్ల రూపాయల నిధులను విడదల చేయనుంది. మహిళ దినోత్సవం సందర్భంగా ఆడబిడ్డలకు ఈ కానుకను అందచేయనుంది. పట్టణాల్లోని స్వయం సహాయక సంఘాల కోసం 250 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. కొంతకాలంగా పెండింగ్ లో ఉన్న నిధులను మహిళ దినోత్సవం సందర్భంగా విడుదల చేసింది.
స్వయంగా నిలబడేందుకు...
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ రుణాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. మహిళలు స్వయంగా తమ కాళ్ల మీద నిలబడేందుకు ఈ వడ్డీ లేని రుణాలు ఉపయోగపడతాయని మంత్రి తెలిపారు. మహిళలకు మరింత ప్రోత్సాహకరమైన పథకాలను తీసుకువస్తామని ఆయన తెలిపారు. అలాగే మహిళ దినోత్సవం రోజును వంద మహిళ ఆసుపత్రులను కూడా ప్రారంభించనున్నారు.
Next Story