Mon Dec 23 2024 06:35:31 GMT+0000 (Coordinated Universal Time)
Ugadi : ఉగాది పచ్చడిని ఇలా తయారు చేస్తారు...ఎందుకంటే?
ఉగాది రోజు ప్రతి ఇంటా కనిపించేది ఉగాది పచ్చడి మాత్రమే. ఈ పచ్చడిని తయారు చేయడంలోనే అనేక అర్థాలున్నాయి.
ఉగాది... యుగానికి ఆది అని అర్థం.. యుగం అంటే.. సంవత్సరం అని అర్థం చేసుకోవాలని పండితులు చెబుతారు. ఈ ఉగాది రోజు ప్రతి ఇంటా కనిపించేది ఉగాది పచ్చడి మాత్రమే. ఈ పచ్చడిని తయారు చేయడంలోనే అనేక అర్థాలున్నాయి. పచ్చడిలోనే జీవితంలో అన్ని పాళ్లు కలసి ఉంటాయని చెబుతారు. తీపి, చేదు, కారం, వగరు ఇలా అన్ని రకాలుగా ఉగాది పచ్చడిని భావిస్తారు. ఇందులో మొత్తం ఆరు రుచులు ఉంటాయని పెద్దలు చెబుతారు. ఆరు రుచుల సమ్మేళనంతోనే ఉగాది పచ్చడిని తయారు చేస్తారు.
షడ్రచులు...
తీపి, కారం, పులుపు, వగరు, చేదు, కారం కలయికతో ఉగాది పచ్చడిని తయారు చేస్తారు. మన జీవితంలో అన్ని రుచి చూడాలన్నది ఈ ఉగాది పచ్చడి విశిష్టత. కష్టాలు.. సుఖాలు.. దు:ఖాలు, సంతోషాలు.. ఇలా అన్నీ జీవితంలో చూడాల్సి వస్తుందని ఈ పచ్చడి ద్వారా మన సంస్కృతి తెలియచేస్తుంది. ఈ పచ్చడిలో కలిపే వేప పుప్వు చేదుకు గుర్తుగా, మామిడి ముక్కలు పులుపుకు... అరటిపండ్లు తీపికి గుర్తులుగా ఇందులో జత చేస్తారు. బెల్లాన్ని కూడా ఇందులో కలుపుతారు. వేసవి కాలంలో వేడి చేయకుండా, పూర్తిగా తిన్నది జీర్ణం కావడానికి వీటిని ఉగాది పచ్చడిలో ఉపయోగిస్తారని పెద్దలు చెబుతారు.
పచ్చడితోనే...
ఈ పచ్చడి తినడం ద్వారా జీవితం అంటే అర్థమయ్యేలా పూర్వీకులు ఈ తరం వారికి చెప్పే విధంగా ఉంటుంది. పచ్చడిలో మాదిరిగానే జీవితంలోనే షడ్రచులు ఉంటాయని, వాటిని సంతోషంగా ఆస్వాదించాలని పెద్దలు చెబతారు. ఆరోగ్య కరమైన ప్రయోజనాలు కూడా ఇందులో ఉంటాయి. వసంత కాలం కావడంతో పచ్చని చెట్లు చిగుర్లు వేస్తాయి. శరీరంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ రకమైన రుచులు జీవితంలో అవసరమని కూడా చెప్పేలా ఉగాది పచ్చడిని తయారు చేస్తారు. సుఖాలను ఎంత ఆనందంగా స్వీకరిస్తామో.. కష్టాలను కూడా అదే మాదిరిగా తీసుకుని జీవితంలో ముందుకు సాగాలన్నది ఈ ఉగాది పచ్చడి ముఖ్య ఉద్దేశం.
Next Story