Mon Dec 23 2024 15:25:31 GMT+0000 (Coordinated Universal Time)
బాయ్ కాట్ చేసిన జగ్గారెడ్డి
కాంగ్రెస్ లో విభేదాలు భగ్గుమన్నాయి. ఆ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సీఎల్పీ సమావేశాన్ని బాయ్ కాట్ చేసి వెళ్లిపోయారు.
కాంగ్రెస్ లో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. ఆ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సీఎల్పీ సమావేశాన్ని బాయ్ కాట్ చేసి వెళ్లిపోయారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో తాజ్ డెక్కన్ లో సమావేశం ప్రారంభమయింది. ఈ సమావేశానికి పీసీసీ మాజీ అధ్యక్షులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, సీనియర్ నేతలు హాజరయ్యారు. ఈ సమావేశం అజెండా ఒక్కటే. అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించాల్సిన అంశాలను సీఎల్పీ దృష్టికి తీసుకురావడం.
మెదక్ లో తనకు....
అయితే సీఎల్పీ సమావేశానికి హాజరయిన జగ్గారెడ్డి రేవంత్ రెడ్డి వ్యవహారంపై మాట్లాడాలని పట్టుబట్టారు. ఇందుకు మల్లు భట్టి విక్రమార్క అభ్యంతరం తెలిపారు. సర్ది చెప్పబోయారు. ఈరోజు కూడా తనకు సమాచారం లేకుండా మెదక్ జిల్లాలో రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారని, తాను పార్టీకి దూరంగా ఉంటానని జగ్గారెడ్డి సమావేశం నుంచి వెళ్లిపోయారు. రేవంత్ రెడ్డి ఈరోజు మెదక్ లో చర్చిని సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు జరిపారు.
Next Story