Sun Dec 22 2024 22:37:28 GMT+0000 (Coordinated Universal Time)
It Raids : హైదరాబాద్లో మరోసారి ఐటీ రైడ్స్.. రాజకీయ నేతలే లక్ష్యంగా
హైదరాబాద్ లో మరొకసారి ఈరోజు తెల్లవారుజాము నుంచి ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు
హైదరాబాద్ లో మరొకసారి ఈరోజు తెల్లవారుజాము నుంచి ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస పార్టీలలో టిక్కెట్ ఆశిస్తున్న వారి ఇళ్లలో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. .మహేశ్వరం కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఆయన ఇల్లు, కార్యాలయంలో కూడా ఈ సోదాలు జరుగుతున్నాయి.
కాంగ్రెస్ అభ్యర్థి...
అలాగే మహేశ్వరం కాంగ్రెస్ టికెట్ ఆశించిన పారిజాతం ఇంట్లో కూడ ఐటీ సోదాలు జరుగుతున్నాయి. బాలాపూర్ లోని ఆమె ఇంటితో పాటు పది చోట్ల ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు.బాలాపూర్ లో లడ్డు వేలంలో దక్కించుకున్న వంగటే లక్ష్మారెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. పలువురు రాజకీయ నేతల ఇళ్లలో సోదాలు జరుగుతుండటంతో ఎన్నికల వేళ తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది.
Next Story