Mon Dec 23 2024 12:57:12 GMT+0000 (Coordinated Universal Time)
ఫిబ్రవరి 12 వరకూ ఆన్ లైన్ క్లాసులే !
అండర్ గ్రాడ్యుయేట్ మూడు, నాల్గవ సంవత్సరంతో పాటు.. ఫార్మ్ డితో సహా అన్ని పీజీ కోర్సులకు క్లాస్వర్క్ లేదా పరీక్షలు
ఫిబ్రవరి 12వ తేదీ వరకూ ఆన్ లైన్ క్లాసులే నిర్వహించనున్నట్లు జవహర్లాల్ నెహ్రూ టెక్నోలాజికల్ యూనివర్శిటీ-హైదరాబాద్ (JNTU-H) వెల్లడించింది. అండర్ గ్రాడ్యుయేట్ మొదటి, రెండవ సంవత్సరం విద్యార్థులకు ఫిబ్రవరి 12 వరకూ ఆన్ లైన్ క్లాసులే కొనసాగుతాయని యూనివర్శిటీ అధికారులు తెలిపారు. ఆ తర్వాత కోవిడ్ నియమ, నిబంధనలను అనుసరించి క్యాంపస్ తరగతులు నిర్వహిస్తామని తెలిపారు.
అలాగే.. అండర్ గ్రాడ్యుయేట్ మూడు, నాల్గవ సంవత్సరంతో పాటు.. ఫార్మ్ డితో సహా అన్ని పీజీ కోర్సులకు క్లాస్వర్క్ లేదా పరీక్షలు ఫిబ్రవరి 1 నుండి కోవిడ్-19 భద్రతా నిబంధనలను అనుసరించి క్యాంపస్లో నిర్వహించబడతాయని వెల్లడించారు. ఈ మేరకు JNTU-H ఓ లేఖను విడుదల చేసింది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అన్ని విద్యాసంస్థలను తెరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతులిచ్చిన నేపథ్యంలో.. తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు JNTU-H లేఖలో పేర్కొంది.
Next Story