Thu Apr 03 2025 23:39:10 GMT+0000 (Coordinated Universal Time)
నేటి నుంచి ఆన్ లైన్ క్లాసులు ప్రారంభం
నేటి నుంచి తెలంగాణలో ఆన్ లైన్ క్లాసులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

నేటి నుంచి తెలంగాణలో ఆన్ లైన్ క్లాసులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో విద్యాసంస్థలకు ఈ నెల 30వ తేదీ వరకూ ప్రభుత్వం సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే విద్యాసంవత్సరం వృధా కాకుండా ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు.
యాభై శాతం మంది సిబ్బంది....
8,9,10 తరగతులకు ఆన్ లైన్ క్లాసులు నేటి నుంచి జరగనున్నాయి.. దీంతో పాటు యాభై శాతం మంది టీచింగ్, నాన్ టీచించ్ సిబ్బంది ఈరోజు నుంచి విద్యాసంస్థలకు హాజరు కావాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Next Story