Tue Apr 22 2025 10:07:48 GMT+0000 (Coordinated Universal Time)
Telnangana Elections Counting : ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి...ఆఖరి ఫలితం మాత్రం ఆ నియోజకవర్గమే
తెలంగాణ ఎన్నికలకు ఇంకా కొద్ది గంటల సమయం మాత్రమే ఉంది. ఈ ఎన్నికల్లో 2,290 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు

తెలంగాణ ఎన్నికలకు ఇంకా కొద్ది గంటల సమయం మాత్రమే ఉంది. ఈ ఎన్నికల్లో 2,290 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 119 నియోజకవర్గాల్లో రేపు ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద 11 సెక్షన్ ను విధించారు. మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. తొలి ఫలితం పది గంటలకు వెలువడే అవకాశముంది. చిన్న నియోజకర్గాలకు సంబంధించి తొలి ఫలితాన్ని అధికారులు అధికారికంగా ప్రకటించనున్నారు.
గజ్వేల్ నియోజకవర్గం...
కాగా రేపు శాంతి భద్రతల పర్యవేక్షణ కోసం ప్రత్యేక పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. మొత్తం 49 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఆలస్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. అన్ని నియోజకవర్గాలకన్నా అక్కడే చివరి ఫలితం వెలువడే అవకాశముంది. అక్కడ ఎక్కువ మంది అభ్యర్థులు రంగంలో ఉండటంతో ఎక్కువ ఈవీఎలంను పరిశీలించాల్సి రావడంతో గజ్వేల్ ఫలితం ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి.
Next Story