Mon Dec 23 2024 00:08:02 GMT+0000 (Coordinated Universal Time)
రాజాసింగ్ కు 14 రోజుల రిమాండ్
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు పథ్నాలుగు రోజుల పాటు న్యాయస్థానం రిమాండ్ విధించింది. ఆయన బెయి్ పిటీషన్ ను తిరస్కరించింది
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు పథ్నాలుగు రోజుల పాటు న్యాయస్థానం రిమాండ్ విధించింది. ఆయన బెయి్ పిటీషన్ ను తిరస్కరించింది. రాజాసింగ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజాసింగ్ కు బెయిల్ ఇస్తే ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడతాయని పోలీసుల తరుపున న్యాయవాదులు చెబుతున్నారు. ఆయనను చంచలగూడ జైలుకు తరలించే ప్రక్రియను చేపట్టారు. అయితే మార్గమధ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. చంచల్ గూడ జైలు పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులు మొహరించారు. చంచల్ గూడ జైలుకు తీసుకెళ్తారా? లేక చర్లపల్లి జైలుకు తీసుకెళ్తారా? అన్నది చూడాల్సి ఉంది.
పార్టీ నుంచి బహిష్కరణ...
ఎమ్మెల్యే రాజాసింగ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయకూడదో పది రోజుల్లో సమాధానం ఇవ్వాలని కోరింది. బీజేపీ అధినాయకత్వం రాజాసింగ్ పై చర్యలు తీసుకోవడానికి అనేక కారణాలు కన్పిస్తున్నాయి. ప్రధానంగా మునుగోడు ఉప ఎన్నికలు జరిగే సమయంలో రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు పార్టీని ఇబ్బందిపెట్టే విధంగా ఉన్నాయి. ఈ మేరకు పార్టీ అధినాయకత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. రాజాసింగ్ కు ఇచ్చిన బాధ్యతల నుంచి కూడా పార్టీ అధినాయకత్వం తప్పించింది.
Next Story