Wed Jan 15 2025 04:37:14 GMT+0000 (Coordinated Universal Time)
అభయారణ్యంలో చిక్కుకున్న 134 మంది.. ప్రతికూల పరిస్థితుల్లో..
గురువారం తెల్లవారుజామున 2.20 గంటల సమయంలో బాధితులను ఎన్డీఆర్ఎఫ్, డీడీఆర్ఎఫ్ బృందాలు సురక్షితంగా..
ముత్యాల ధార జలపాతం వద్ద వాగు ఉద్ధృతి కారణంగా అడవిలో చిక్కుకున్న సుమరు 130 మంది పర్యాటకులను ఎన్డీఆర్ఎఫ్, అటవీ, పోలీస్, రెవెన్యూ శాఖ అధికారులు రక్షించారు. ములుగుజిల్లా వెంకటాపురం మండలంలోని ముత్యంధార జలపాతం సందర్శనకు వెళ్లిన పర్యాటకులు అభయారణ్యంలో చిక్కుకున్నారు. బుధవారం రాత్రి ఈ విషయం వెలుగు చూడగా.. మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ లు జిల్లాకలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులను అప్రమత్తం చేశారు. మంత్రుల ఆదేశాలతో ఘటనా ప్రాంతానికి ఎన్డీఆర్ఎఫ్, డీడీఆర్ఎఫ్ బృందాలను పంపి.. రక్షణ చర్యలు చేపట్టారు.
గురువారం తెల్లవారుజామున 2.20 గంటల సమయంలో బాధితులను ఎన్డీఆర్ఎఫ్, డీడీఆర్ఎఫ్ బృందాలు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. కుండపోత వర్షాల నేపథ్యంలో విరభద్రవరం గ్రామానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న జలపాతం సందర్శనను అటవీశాఖ నిషేధించింది. వరంగల్, కరీంనగర్ ప్రాంతాల నుంచి అప్పటికే వచ్చిన 134 మంది పర్యాటకులు జలపాతం వద్దకు వెళ్లారు. తిరుగుపయనంలో మామిడివాగు ఒక్కసారిగా ఉప్పొంగడంతో అవతలి ప్రాంతంలోనే పర్యాటకులు చిక్కుకున్నారు. ఎంతకూ ప్రవాహం తగ్గకపోవడంతో.. కరీనంగర్ జిల్లా హుజూరాబాద్ కు చెందిన తిరుమల్ డయల్ 100కు సమాచారమివ్వగా.. అధికార యంత్రాంగం అప్రమత్తమై విషయాన్ని ఉన్నతాధికారులకు తెలిపింది. మంత్రులతో చర్చించి.. రాత్రి 11 గంటల నుంచి సహాయక చర్యలు చేపట్టి బాధితులను రక్షించామని ఎస్సై కొప్పుల తిరుపతిరావు తెలిపారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా కు చెందిన రాష్ట్ర మంత్రులు శ్రీమతి సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు గార్ల సహాకారం తో ములుగు జిల్లా కలెక్టర్ , SP, జిల్లా అధికారులను అప్రమత్తం చేసి పర్యాటకులను సురక్షితంగా తీసుకురావడం లో కృషి చేసిన NDRF, అటవీ, పోలీస్ , రెవెన్యూ శాఖల అధికారులు, ములుగు జిల్లా ప్రభుత్వ యంత్రాంగాన్ని అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్.
అటవీ లో చిక్కుకున్న పర్యాటకులను ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రం నుండి క్షేమంగా వారి గమ్యస్థానాలకు ఈ తెల్లవారి జామున 4గంటలకు పంపించటం జరిగింది.
పర్యాటక మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ వెల్లడి.
ఈ తెల్లవారు జామున NDRF, జిల్లాకు చెందిన గజ ఈతగాళ్ళ, రెస్క్యూ టీం లు , పోలీసులు, అటవీ శాఖ,రెవెన్యూ అధికారుల సహాకారం తో ఘటన స్థలం చేరుకొని 4గంటలకు వాగు ఉధృతం నుండి సుమారు 160 మంది పర్యాటకులని దాటించి వెంకటాపురం మండల కేంద్రానికి తీసుకువచ్చిన జిల్లా అధికారులు.
ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రం నుండి వారి ప్రాంతాలకు సురక్షితంగా పంపించిన జిల్లా అధికారులు.
ముత్యం ధార జలపాతం వద్ద వాగు ఉధృతం గా ప్రవహిస్తుండటంతో వాగు దాటలేక అటవీ లో సుమారు 160 మంది పర్యాటకుల చిక్కుకున్న సమాచారం వచ్చిన వెంటనే రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ నిరంతరం రాష్ట్ర పర్యాటక శాఖ అధికారులతో సమీక్షించారు, తక్షణం స్పందించారు.
అటవీ ప్రాంతంలో ఉన్న జలపాతాల వద్దకు అటవీ శాఖ అధికారాల అనుమతి లేకుండా పర్యాటకులు వెళ్ళడం సురక్షితం కాదని మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ పర్యాటకులకు విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయన్నారు .జలపాతాల వద్దకు వెళ్లేందుకు పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలనీ సూచించారు.
Next Story