Thu Nov 28 2024 20:47:39 GMT+0000 (Coordinated Universal Time)
యాత్ర 26 నుంచి కాదట.. అందువల్లనే
ఫిబ్రవరి 6 నుంచి కాంగ్రెస్ నేతల పాదయాత్ర మొదలు కానుంది. హాత్ సే హాత్ సే జోడో కార్యక్రమంలో భాగంగా ఈ పాదయాత్ర జరగనుంది.
ఫిబ్రవరి 6 నుంచి కాంగ్రెస్ నేతల పాదయాత్ర మొదలు కానుంది. హాత్ సే హాత్ సే జోడో కార్యక్రమంలో భాగంగా ఈ పాదయాత్ర జరగనుంది. పీీీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి యాభై నియోజకవర్గాల్లో యాత్ర చేసేలా ప్లాన్ చేశారు. రేవంత్ రెడ్డితో పాటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ కూడా పాదయాత్రలు చేపట్టాలని తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్రావు థాక్రే సూచించారు. నిజానికి జనవరి 26 నుంచి ప్రారంభం కావాల్సిన పాదయాత్రను ఫిబ్రవరి 6వ తేదీ నుంచి చేయాలని నిర్ణయించారు.
ఫిబ్రవరి 6నుంచి...
కలసి కట్టుగా హాత్ సే హాత్ జోడో కార్యక్రమాల్లో పాల్గొనాలని మాణిక్రావు థాక్రే నేతలను కోరారు. రేవంత్ రెడ్డి పాదయాత్ర భద్రాచలంలో ప్రారంభం కానుంది. ముందు అనుకున్నట్లుగా మూడు నెలలు కాకుండా యాభై రోజులకు యాత్రను కుదిరించారని తెలిసింది. భద్రాచలంలో భారీ బహిరంగ సభను నిర్వహించి ఆ సభకు ప్రియాంక గాంధీని ఆహ్వానించాలని నిర్ణయించారు. అందరూ ఏకతాటిపై నిలబడి పాదయాత్రను సక్సెస్ చేయాలని మాణిక్రావు థాక్రే సూచించారు.
Next Story