Mon Dec 23 2024 08:27:49 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : పాలమూరు మున్సిపాలిటీ కాంగ్రెస్ పరం
పాలమూరు మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. పాలమూరు మున్సిపల్ ఛైర్మన్ పై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థల్లోనూ అధికార మార్పిడి జరుగుతుంది. స్థానిక సంస్థలలో మొన్నటి వరకూ అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మున్సిపాలిటీల్లో ఛైర్మన్ కు వ్యతిరేకంగా కౌన్సిలర్లు కాంగ్రెస్ తో చేతులు కలిపి దించేస్తుండటంతో అధికారాన్ని కోల్పోవాల్సి వస్తుంది.
పాలమూరు మున్సిపాలిటీని...
తాజాగా పాలమూరు మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. పాలమూరు మున్సిపల్ ఛైర్మన్ పై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 30 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఓటు వేయడంతో బీఆర్ఎస్ మున్సిపల్ ఛైర్మన్ పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. మున్సిపాలిటీ కాంగ్రెస్ పరమయింది.
Next Story