Fri Nov 22 2024 18:24:00 GMT+0000 (Coordinated Universal Time)
భాగ్యనగరంలో మరో కేబుల్ బ్రిడ్జి.. రేపే ప్రారంభం
పాత గేటు నుంచి హైటెన్షన్ విద్యుత్ పోల్ వరకూ..రోడ్డు విస్తరణ చేయడంతో వాహనదారులకు ట్రాఫిక్ సమస్యలు తప్పనున్నాయి. కాగా..
హైదరాబాద్ వాసులకు మరో కేబుల్ బ్రిడ్జి అందుబాటులోకి రానుంది. ఇప్పటికే నిర్మించిన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి నగరానికి మణిహారంగా నిలిచింది. పంజాగుట్ట నుంచి బంజారాహిల్స్ వెళ్లే రోడ్డులో నిర్మించిన స్టీల్ బ్రిడ్జి నగరానికి మరింత వన్నె తీసుకురానుంది. పంజాగుట్ట స్మశాన వాటిక పాత ద్వారాన్ని తొలగించి, కొత్త బ్రిడ్జిని నిర్మించడంతో.. స్మశాన వాటికకు వెళ్లే ప్రజలకు ఇబ్బందులు తొలగనున్నాయి.
పాత గేటు నుంచి హైటెన్షన్ విద్యుత్ పోల్ వరకూ..రోడ్డు విస్తరణ చేయడంతో వాహనదారులకు ట్రాఫిక్ సమస్యలు తప్పనున్నాయి. కాగా.. ఈ స్టీల్ బ్రిడ్జి నిర్మాణం కోసం జీహెచ్ఎంసీ అధికారులు రూ.17 కోట్లు మంజూరు చేశారు. గురువారం ఉదయం 10 గంటలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ బ్రిడ్జిని ప్రారంభించనున్నారు.
News Summary - Panjagutta Steel Cable Bridge Inaugurate by Minister talasani Srinivas yadav on January 20th
Next Story