Mon Dec 23 2024 11:33:32 GMT+0000 (Coordinated Universal Time)
నేడు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం
రేపటి నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని కేసీఆర్ నిర్ణయించనున్నారు.
రేపటి నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని కేసీఆర్ నిర్ణయించనున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రసమితి పార్లమెంటరీ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశంలో పార్లమెంటులో ఏ ఏ అంశాలపై టీఆర్ఎస్ స్పందించాలి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీసుకోవాల్సిన అంశాలపై పార్లమెంటు సభ్యులకు, రాజ్యసభ సభ్యులకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారు.
కేంద్ర ప్రభుత్వంపై.....
ఇటీవల కేంద్ర ప్రభుత్వం టీఆర్ఎస్ సర్కార్ దూకుడుగా వెళుతున్న సంగతి తెలిసిందే. వరి ధాన్యం కొనుగోలు నుంచి ప్రారంభమైన ఈ దూకుడు ఇంకా కొనసాగుతూనే ఉంది. పార్లమెంటు సమావేశాల్లోనూ కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వ్యవహరించాలన్నది కేసీఆర్ ఆలోచన. రాష్ట్రానికి రావాల్సిన నిధులు. పెండింగ్ ప్రాజెక్టు వంటి అంశాలతో పాటు ఐఏఎస్ అధికారుల విషయంలో కేంద్రం తీసుకొచ్చిన సవరణలు, విద్యుత్ సంస్కరణల వంటి వాటిపై టీఆర్ఎస్ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమవుతుంది.
Next Story