Mon Dec 23 2024 15:06:09 GMT+0000 (Coordinated Universal Time)
మధు యాష్కిపై మాణికం ఠాగూర్ సీరియస్
కీలక సమావేశానికి నేతలు హాజరు కాకపోవడంపై పార్టీ ఇన్ఛార్జి మాణికం ఠాగూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు
మునుగోడు ఉప ఎన్నికను కాంగ్రెస్ నేతలు సీరియస్ గా తీసుకోవడం లేదు. కీలక సమావేశానికి నేతలు హాజరు కాకపోవడంపై పార్టీ ఇన్ఛార్జి మాణికం ఠాగూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ నేతల తీరు సరిగా లేదని మాణికం ఠాగూర్ మండి పడ్డారు. కీలకమైన మునుగోడు స్ట్రాటజీ కమిటీకి కాంగ్రెస్ సీనియర్ నేతలు హాజరు కాలేదు. మధు యాష్కీ, జానారెడ్డి, సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి వారు ఈ సమావేశానికి హాజరు కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చినా కొందరు ఆలస్యంగా వచ్చారు.
పార్టీ కోసం పనిచేయాలని...
వ్యక్తిగత ఇమేజ్ కోసం కాకుండా పార్టీ కోసం పనిచేయాలని ఆయన హితవు పలికారు. మునుగోడు మండల ఇన్ఛార్జుల తీరుపైనా ఆయన అసహనం వ్యక్తం చేశారు. క్యాడర్ ను కాపాడుకునేందుకు ప్రయత్నించాలని, ప్రతి ఒక్కరూ ఫీల్డ్ లెవెల్ లో పనిచేయాలని మాణికం ఠాగూర్ సూచించారు. నేతలంతా కలసి కట్టుగా మునుగోడులో విజయం కోసం పనిచేయాల్సిన తరుణంలో కీలక మీటింగ్ కు కూడా రాకపోవడం పై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
Next Story