Wed Dec 18 2024 21:12:09 GMT+0000 (Coordinated Universal Time)
KTR : కేటీఆర్ కు మరో దెబ్బ.. మరికొందరు నేతలు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడింగ్ కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో పార్టీ నేతలు గుడ్ బై చెబుతున్నారు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడింగ్ కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో పార్టీ నేతలు వరసగా గుడ్ బై చెబుతున్నారు. పార్టీకి రాజీనామా చేస్తున్నారు. సిరిసిల్ల నియోజకవర్గం ముస్తాబాద్ మండలం లో బీఆర్ఎస్ పార్టీకి నేతలు మూకుమ్మడి రాజీనామా చేయనున్నారు. వీరిలో పలువురు జడ్పీటీసీలు, సర్పంచ్లు ఉన్నారని తెలిసింది.
పార్టీకి రాజీనామా చేసి...
వీరంతా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. కేటీఆర్ సిరిసిల్ల జిల్లా పార్టీ ప్రతినిధులు, కార్యకర్తలు, నేతలతో సమావేశం పెడుతున్నా ఫలితం లేకుండా పోతుంది. వరస పెట్టి మారుతుండటంతో బీఆర్ఎస్ లో కొంత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న సిరిసిల్ల మున్సిపల్ కౌన్సిలర్లు పదహారు మంది జంప్ అయిన సంగతి తెలిసిందే.
Next Story