Fri Dec 20 2024 04:30:06 GMT+0000 (Coordinated Universal Time)
Rahul Gandhi : 26న తెలంగాణకు రాహుల్ గాంధీ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ నెల 25, 26 తేదీల్లో తెలంగాణలో పర్యటించనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి
తెలంగాణలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రచారానికి ఐదురోజులు మాత్రమే గడువు ఉండటంతో అన్ని పార్టీలూ స్పీడ్ ను పెంచాయి. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు తెలంగాణలో పర్యటిస్తూ ప్రచారాన్ని ముందుకు తీసుకెళుతున్నారు. మల్లికార్జున ఖర్గే నుంచి రాష్ట్ర స్థాయి నేతలు ప్రచారంలో అన్ని నియోజకవర్గాలను చుట్టి వస్తున్నారు.
రెండు రోజుల పాటు...
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ నెల 25, 26 తేదీల్లో తెలంగాణలో పర్యటించనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. 25వ తేదీన బోధన్, ఆదిలాబాద్, వేములవాడల్లో రాహుల్ ప్రచారం చేయనున్నారు. బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. 26వ తేదీన కామారెడ్డి, సంగారెడ్డి, జహీరాబాద్ లలో పాల్గొంటారు కాంగ్రెస్ ఆరు గ్యారంటీలతో పాటు మ్యానిఫేస్టోను కూడా ప్రజలకు వివరించనున్నారు.
Next Story