Mon Dec 23 2024 11:27:35 GMT+0000 (Coordinated Universal Time)
లాస్య నందిత కేసులో కీలక పరిణామం.. అతడిపై కేసు నమోదు
ఎమ్మెల్యే లాస్య నందిత మృతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సోదరి నివేదిత ఫిర్యాదుతో కేసు నమోదయింది.
ఎమ్మెల్యే లాస్య నందిత మృతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సోదరి నివేదిత ఫిర్యాదుతో పటాన్ చెర్వు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. లాస్య నందిత పీఏ ఆకాష్ పై కేసు నమోదు చేశారు. 304 ఏ ఐపీసీ సెక్షన్ల పటాన్ చెరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆకాష్ నిర్లక్ష్యంగా కారు నడపటం వల్లనే తన సోదరి మరణించిందని నివేదిత ఇచ్చిన ఫిర్యాుద మేరకు కేసు నమోదు చేశారు.
నిర్లక్ష్యంగా కారు నడిపాడని...
అతి వేగంతో కారు నడపటమే కాకుండా నిర్లక్ష్యంగా నడిపారని కేసు నమోదు చేశారు. ఈరోజు తెల్లవారు జామున కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ప్రమాద సమయంలో కారు నడిపింది ఆమె పీఏ ఆకాష్ గా పోలీసులు గుర్తించారు. ఆకాష్ కూడా గాయాలపాలయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
Next Story