పటాన్ చెరు సీపీఎం అభ్యర్థిగా నామినేషన్ వేసిన జె.మల్లికార్జున్
పటాన్ చెరు సీపీఎం అభ్యర్థిగా జె.మల్లికార్జున్ నామినేషన్ వేశారు
పటాన్ చెరు సీపీఎం అభ్యర్థిగా జె.మల్లికార్జున్ నామినేషన్ వేశారు. అట్టహాసంగా ఆయన నామినేషన్ వేశారు. నామినేషన్ బహిరంగ సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్. వీరయ్య మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతుక అయిన సీపీఎంకు పట్టం కట్టాలని పిలుపును ఇచ్చారు. ప్రజా సమస్యలపై, కార్మిక వర్గ సమస్యలపై ప్రశ్నించే గొంతుకగా ఉండే అభ్యర్థిని ఓటు ద్వారా ఎన్నుకోవాలని.. కమ్యూనిస్టులు బలహీనపడితే ప్రజలకు, శ్రామిక వర్గానికి ఎంతో మంచి జరుగుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బలపడకుండా నిలువరించింది వామపక్ష పార్టీలేనన్నారు.తెర ముందు ఒకటి, తెర వెనుక మరోకటి.. ఇదే బీజేపీ పట్ల బీఆర్ఎస్ వైఖరి అని విమర్శించారు. ఏకపక్షంగా అహంకారపూరితంగా.. మమ్మల్ని సంప్రదించకుండా కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశం స్వయానా మన రాష్ట్ర ముఖ్యమంత్రే తెలియజేశారని.. ఇదే అవినీతికి సాక్ష్యమన్నారు. ప్రజాస్వామ్య ఉనికే లేకుండా కేంద్ర బీజేపి ప్రభుత్వం కుట్ర చేస్తుంది.. మతోన్మాదం పేట్రేగిపోతున్నా, బలహీన వర్గాల పై నిత్యం దాడులు జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం స్పందించదన్నారు. ప్రజలను మతాలవారీగా, కులాల వారిగా చీల్చి మతపరమైన అంశాలలో వారిని రెచ్చగొట్టి ఓట్లు దండుకోవాలని చూస్తోంది.. ధరల పెరుగుదలను అదుపు చేయడానికి, పేదరికం నిర్మూలన వంటి వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో శాస్త్రీయ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించిన ఏకైక పార్టీ సిపిఎం మాత్రమేనన్నారు.