Mon Dec 23 2024 07:49:28 GMT+0000 (Coordinated Universal Time)
Telangana Congress: మరో ఎమ్మెల్యే కాంగ్రెస్ గూటికి
బీఆర్ఎస్కు చెందిన మరో ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరారు
బీఆర్ఎస్కు చెందిన మరో ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. జహీరాబాద్ లోక్ సభ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన గాలి వినోద్ కుమార్ కూడా కాంగ్రెస్ లో చేరారు. సోమవారం సాయంత్రం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి.. ఆయన నివాసంలో అధికార పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి వారికి పార్టీ కండువాను కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాటా శ్రీనివాస్ గౌడ్‌పై గూడెం మహిపాల్ రెడ్డి 7 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలిచారు. గత లోక్ సభ ఎన్నికల్లో గాలి వినోద్ కుమార్ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు.
తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 74కి చేరుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరిన పదవ BRS ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Next Story