Mon Dec 23 2024 02:35:39 GMT+0000 (Coordinated Universal Time)
వివాదానికి ముగింపు.. రేవంత్ క్షమాపణ
ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పారు.
ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పారు. మునుగోడు నియోజకవర్గంలోని చుండూరు సభలో అద్దంకి దయాకర్ వ్యాఖ్యలు సరికాదని రేవంత్ రెడ్డి తెలిపారు. ఇలాంటి వ్యాఖ్యలు ఎవరిపైన చేసినా సరికాదని అన్నారు. పత్రికా సమావేశంలోనూ హోంగార్డుల ప్రస్తావన కూడా సరికాదని రేవంత్ రెడ్డి తెలిపారు. బేషరతుగా దీనిపై కోమటిరెడ్డి వెంకటరెడ్డికి క్షమాపణలు చెబుతున్నానని ప్రకటించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కించపర్చడం తగదన్నారు.
వీడియో విడుదల....
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈ మేరకు వీడియో విడుదల చేశారు. ఎవరు ఇలాంటి వ్యాఖ్యలు చేసినా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తనకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇటీవల తరచూ డిమాండ్ చేస్తూ వస్తున్నారు. దీనిపై రేవంత్ రెడ్డి ఈ వివాదానికి ముగింపు పలికారు. అద్దంకి దయాకర్ వాడిన వ్యాఖ్యలపై క్రమశిక్షణ సంఘం చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు. తాను బేషరతుగా రేవంత్ రెడ్డికి క్షమాపణలు చెబుతున్నట్లు ఆయన ప్రకటించారు.
Next Story