Sat Dec 21 2024 14:37:04 GMT+0000 (Coordinated Universal Time)
కేసీఆర్ కు రేవంత్ సవాల్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు పీసీసీచీఫ్ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. దమ్ముంటే కొడంగల్ లో పోటీ చేయాలని ఛాలెంజ్ చేశారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు పీసీీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. దమ్ముంటే కొడంగల్ లో పోటీ చేయాలని కేసీఆర్ కు ఛాలెంజ్ చేశారు. ఎవరు ఓటమి పాలయినా వారు రాజకీయాలను వదిలేద్దామని చెప్పారు. కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు ఇచ్చిన హామీలెన్ని? ఎన్ని అమలు చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
హామీల అమలులో...
తాను కూడా కొడంగల్ లో నామినేషన్ వేస్తానని రేవంత్ తెలిపారు. ప్రజలను మోసం చేయడంలో కేసీఆర్ తొమ్మిదేళ్ల నుంచి ముందుంటూనే ఉన్నారని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈసారి ఎన్నికల్లో కేసీఆర్ ఓటమి తప్పదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ గెలుపు తెలంగాణలో ఖాయమయిందని ఆయన అన్నారు. ప్రజలు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ ను సంపూర్ణ మెజారిటీతో ఆశీర్వదిస్తారని ఆయన అన్నారు.
Next Story