Mon Dec 23 2024 08:45:08 GMT+0000 (Coordinated Universal Time)
ఇది కుక్కల పాలన : రేవంత్ ఫైర్
తెలంగాణ ప్రభుత్వంపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది బీఆర్ఎస్ పాలన కాదని, కుక్కల పాలన అని అన్నారు
తెలంగాణ ప్రభుత్వంపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది బీఆర్ఎస్ పాలన కాదని, కుక్కల పాలన అని అని మండి పడ్డారు. హాత్ సే హాత్ జోడో పాదయాత్రలో ఉన్న రేవంత్ రెడ్డి నిన్న కుక్కల దాడిలో బాలుడి మరణంపై స్పందించారు. కుక్కల దాడిలో బాలుడు మరణిస్తే సారీ చెప్పి వదిలేస్తారా? అని ప్రశ్నించారు. ఇంత అమానవీయంగా గతంలో ఏ ప్రభుత్వమూ వ్యవహరించలేదని ఆయన ఫైర్ అయ్యారు.
ఆకలేసి దాడిచేశాయా?
కుక్కల దాడిలో మరణించిన బాలుడి కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా వీధి కుక్కల బారి నుంచి ప్రజలను రక్షించాలని ఆయన కోరారు. మనుషులు చనిపోతే కుక్కలకు ఆపరేషన్ చేస్తారంటారా? అని ప్రశ్నించారు. మున్సిపల్ శాఖమంత్రిగా కేటీఆర్ విఫలమయ్యారన్న రేవంత్ ఆకలేసింది కాబట్టే కుక్కలు దాడి చేశాయని హైదరాబాద్ మేయర్ మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. వీధికుక్కలే మనుషులను పీక్కుతినే పరిస్థిితి ఈ ప్రభుత్వంలో ఉందని దుయ్యబట్టారు. ఇదొక రాక్షస ప్రభుత్వమని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Next Story