Mon Dec 23 2024 06:15:40 GMT+0000 (Coordinated Universal Time)
క్షమాపణ కాదు కాని వివరణ ఇదిగో
పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పీసీసీచీఫ్ రేవంత్ రెడ్డి వివరణ ఇచ్చారు
పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పీసీసీచీఫ్ రేవంత్ రెడ్డి వివరణ ఇచ్చారు. రాజగోపాల్ రెడ్డిపై తాను చేసిన వ్యాఖ్యలకు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబందం లేదని రేవంత్ తెలిపారు. రాజగోపాల్ రెడ్డి వేరు, వెంకటరెడ్డి వేరు అని ఆయన అన్నారు. రాజగోపాల్ రెడ్డి ప్రస్తావించే బ్రాండ్ ఇచ్చింది కాంగ్రెస్ అని తెలిపారు. రాజగోపాల్ రెడ్డి పార్టీ ద్రోహి అని మరసారి విమర్శించారు. తమ మధ్య కొందరు అగాధం సృష్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు.
తాను చేసిన కామెంట్స్ పై....
ఇటీవల కోమటిరెడ్డి బ్రాండ్ పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడిన సంగతి తెలిసిందే. తమ బ్రాండ్ ను అవమానించారన్నారు. తనకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. దీనిపై స్పందించిన రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పలేదు కాని తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. ఇద్దరి మధ్య ఈ వివరణతో సత్సంబంధాలు నెలకొంటాయా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.
Next Story