Mon Dec 23 2024 16:42:48 GMT+0000 (Coordinated Universal Time)
బరాబర్ చెబుతున్నా... నేనే కూలుస్తా
ప్రగతి భవన్ పై తాను చేసిన కామెంట్స్ పై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వివరణ ఇచ్చారు. ఆయన మీడియా చిట్ చాట్ లో మాట్లాడారు
ప్రగతి భవన్ పై తాను చేసిన కామెంట్స్ పై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వివరణ ఇచ్చారు. ఆయన మీడియా చిట్ చాట్ లో మాట్లాడారు. ప్రగతి భవన్ ప్రజల సొమ్ముతో కట్టిందన్నారు. అది ముఖ్యమంత్రి అధికారిక నివాసం మాత్రమేనని రేవంత్ రెడ్ి అన్నారు. ప్రజాదర్బార్ నిర్వహించడానికే ప్రగతి భవన్ ఉండాలని అన్నారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబులు ప్రజలను కలవలేదా? అని రేవంత్ ప్రశ్నించారు. తెలంగాణ పరజలకు ప్రవేశం లేని ప్రగతి భవన్ ఉన్నా లేకపోయినా దండగే అన్నారు. అవసరమైతే ప్రగతి భవన్ ను నేలమట్టం చేసే బాధ్యతను తామే తీసుకుంటామని చెప్పారు.
తెలంగాణ ద్రోహులకు...
తెలంగాణ ద్రోహులకు, తన బంధువులకు మంత్రి పదవులు ఇవ్వాలని నక్సలైట్ల అజెండాలో ఉందా? అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల ఆలోచననే తాను చెప్పానని అన్నారు. తాము గాంధీ వారసులమని, హింసకు వ్యతిరేకమన్న ఆయన శాంతికోసమే ఈ యాత్రను చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్కౌంటర్లు ఉండవని కేసీఆర్ చెప్పాడని, రాష్ట్ర వచ్చిన తర్వాత జరిగిన ఎన్కౌంటర్లకు కేసీఆర్ ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. కేవలం తొమ్మిది నెలల్లో ప్రగతి భవన్ ను, ఏడాదిలో సచివాలయాన్ని కట్టారు కాని 9 ఏళ్లలో అమరవీరుల స్థూపాన్ని కట్టలేకపోయారన్నారు. వృధా ఖర్చులు తగ్గిస్తే రాష్ట్రం మిగులు బడ్జెట్ లోకి వెళుతుందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
Next Story