Mon Dec 23 2024 04:04:31 GMT+0000 (Coordinated Universal Time)
నిజామాబాద్ జిల్లాలో రేవంత్ రెడ్డి
నిజామాబాద్ జిల్లాలో రేవంత్ రెడ్డి పాదయాత్ర నేడు జరగనుంది. ఆరు రోజుల పాటు జిల్లాలోనే కొనసాగనుంది
నిజామాబాద్ జిల్లాలో రేవంత్ రెడ్డి పాదయాత్ర నేడు జరగనుంది. ఆరు రోజుల పాటు జిల్లాలోనే కొనసాగనుంది. గత నెల రోజులుగా రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ములుగు నుంచి ప్రారంభమయిన ఆయన పాదయాత్ర వరసగా అన్ని జిల్లాల మీదుగా నేడు నిజామాబాద్ కు చేరుకోనుంది. రేవంత్ రెడ్డి తన పాదయాత్రలో సమస్యలను వింటూ, పరిశీలిస్తూ ముందుకు సాగుతున్నారు.
ప్రజా సమస్యలను...
ప్రజా సమస్యలను ఆయన వినడమే కాకుండా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే తాము సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. రేవంత్ రెడ్డి పాదయాత్రకు పెద్దయెత్తున ప్రజలు హాజరవుతున్నారు. కాంగ్రెస్ నేతలతో పాటు కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో వస్తుండటంతో ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు. రేవంత్ రెడ్డి పాదయాత్రకు హైకోర్టు ఆదేశాల మేరకు భద్రతను కూడా పెంచారు.
Next Story