Sun Jan 05 2025 03:20:51 GMT+0000 (Coordinated Universal Time)
24న తెలంగాణలోకి జోడో యాత్ర
అక్టోబరు 24న భారత్ జోడో యాత్ర తెలంగాణలోకి ప్రవేశిస్తుందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు
అక్టోబరు 24న భారత్ జోడో యాత్ర తెలంగాణలోకి ప్రవేశిస్తుందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో ముగిసిన తర్వాత తెలంగాణలోకి పాదయాత్ర ప్రవేశిస్తుందని ఆయన తెలిపారు. మహారాష్ట్ర, కర్ణాటక నేతలతో సమన్వయం చేసుకునేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. కర్ణాటకలో 22 రోజులు, ఆంధ్రప్రదేశ్ లో నాలుగు రోజుల పాటు ఈ యాత్ర సాగుతుందని ఆయన చెప్పారు.
మూడు రాష్ట్రాల నేతలతో...
తెలంగాణలో పాదయాత్ర ముగిసిన తర్వాత మహారాష్ట్రలోకి యాత్ర ప్రవేశిస్తుందని చెప్పారు. అందుకే మూడు రాష్ట్రాల నేతలు సమన్వయం చేసుకోవాలని నిర్ణయించామని తెలిపారు. ఇందుకోసం ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకోవడంపై చర్చించామని తెలిపారు. కర్ణాటకలోనూ మహారాష్ట్ర, తెలంగాణ నేతలు పర్యటించాలన్న అంశంపై చర్చించామని అన్నారు. చరిత్రలో ఒక గొప్ప యాత్రలో పాల్గొనడం ఒక అవకాశంగా భావిస్తున్నామని రేవంత్ రెడ్డి చెప్పారు. దేశ భవిష్యత్ ను మార్చే యాత్ర కావడంతో ఇది చరిత్రలో నిలిచపోవడం ఖాయమని ఆయన అన్నారు.
Next Story