Sun Dec 22 2024 15:23:00 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : బీజేపీతో బీఆర్ఎస్ చీకటి ఒప్పందం అందుకే
ఐదు స్థానాల్లో బీజేపీని గెలిపించేందుకు బీఆర్ఎస్ సహకరిస్తుందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు
ఐదు స్థానాల్లో బీజేపీని గెలిపించేందుకు బీఆర్ఎస్ సహకరిస్తుందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. మల్కాజ్ గిరి ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. పదేళ్లు పాలించిన బీజేపీ ఒక్క హామీని కూడా అమలు పర్చలేదన్నారు. కేసీఆర్ బీజేపీతో కుమ్మక్కయ్యారన్నారు. తన బిడ్డను జైలు నుంచి బయటకు తెచ్చుకునేందుకు బీజేపీతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నారన్నారు. మోదీ ప్రభుత్వం ఈ దేశానికి చేసిందేమీ లేదని, తప్పుడు వాగ్దానాలు చేస్తూ మరొక సారి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారన్నారు. మల్కాజ్ గిరి ప్రజలు కేసీఆర్ తో కొట్లాడే ధైర్యం ఇచ్చారన్నారు. ఆ ధైర్యంతోనే దిగి తాను నేడు ముఖ్యమంత్రిని అయ్యానని అన్నారు.
బిడ్డ బెయిల్ కోసం...
బిడ్డ బెయిల్ కోసం బీజేపీతో కేసీఆర్ చీకటి ఒప్పందం కుదుర్చుకుంది నిజం కాదా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 20 లక్షల ఉద్యోగాలిస్తానన్న బీజేపీ ఏడు లక్షల మందికి కూడా ఇవ్వలేదన్నారు. ఈటల రాజేందర్ కు ఓటు అడిగే హక్కు ఉందా అని ఆయన ప్రశ్నించారు. ఈటల మంత్రిగా ఉన్న సమయంలో బీసీలకు ఏమైనాచేశారా? అని నిలదీశారు. అదానీ, అంబానీలకు దేశాన్ని తాకట్టు పెట్టింది ఈ మోదీ ప్రభుత్వం కాదా? అని ప్రశ్నించారు. బీజేపీ మతాల మధ్య చిచ్చుపెట్టి ఓట్ల రాజకీయం చేస్తుందన్నారు. అయోధ్యను వాడుకుని మరోసారి అధికారంలోకి రావాలని అనుకుంటుందన్నారు. రాముడి పేరు మీద ఎంతకాలం రాజకీయం చేస్తారంటూ ఆయన మండిపడ్డారు.
Next Story