Sat Dec 21 2024 05:37:34 GMT+0000 (Coordinated Universal Time)
యాత్రకు సహకరించండి.. రక్షణ కల్పించండి
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర అనుమతి కోసం డీజీపీని కలిశామని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర అనుమతి కోసం డీజీపీని కలిశామని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. డీజీపీని కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రూట్ మ్యాప్ అనుమతి ఇవ్వాలని డీజీపీని కోరామని తెలిపారు. కొందరు విచ్ఛిన్నకర శక్తులు పాదయాత్రలో చొరబడే అవకాశమున్నందున తగిన భద్రత కల్పించాలని కోరినట్లు ఆయన చెప్పారు. తెలంగాణలోని విద్యార్థులు, అమరవీరుల కుటుంబాలు, రైతులు, మహిళలు, మైనారిటీలు అందరూ పార్టీలకు అతీతంగా రాహుల్ గాంధీ యాత్రలో పాల్గొనాలని రేవంత్ రెడ్డి కోరారు.
అందరూ రండి...
కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ ఏకం చేయాలని రాహుల్ గాంధీ ఈ పాదయాత్ర చేస్తున్నారని, అందుకోసం అన్ని వర్గాల వారూ మద్దతు తెలపాలని ఆయన కోరారు. దేశాన్ని కాపాడుకోవడం కోసం అందరూ ముందుకు రావాలని రేవంత్ రెడ్డి కోరారు. తెలంగాణలో భారత్ జోడో యాత్ర దిగ్విజయం చేసేందుకు అందరూ సహకరించాలని కోరారు. గాంధీ కుటుంబానికి ఉండే ప్రాముఖ్యత దృష్ట్యా వారికి ప్రత్యేకంగా భద్రత కల్పించాలని తాము డీజీపీని కోరామని చెప్పారు. ఈ నెల 24వ తేదీన తెలంగాణలో భారత్ జోడో యాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు.
Next Story