Mon Dec 23 2024 06:33:48 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణలో రాహుల్ యాత్ర ఇక్కడే
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను తెలంగాణలో అద్భుతంగా నిర్వహిస్తామని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను తెలంగాణలో అద్భుతంగా నిర్వహిస్తామని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో ప్రవేశించే రాహుల్ యాత్ర జుక్కల్ మీదుగా నాందేడ్ కు వెళుతుందని ఆయన తెలిపారు. అక్బోబరు 2 నుంచి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టనున్నారని రేవంత్ రెడ్డి తెలిపారు. యాత్రలో పార్టీ ప్రజాప్రతినిధులుతో పాటు అనుబంధ విభాగాలు కూడా భాగస్వామ్యులవుతారని రేవంత్ రెడ్డి తెలిపారు.
అన్ని విభాగాలను...
భారత్ జోడో యాత్రపైనే నేడు సమావేశం జరిగిందని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని, మోదీ విధ్వంసాన్ని ఎత్తి చూపేందుకే రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా యాత్ర చేపట్టినట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా, ప్రజా సమస్యలపై ప్రజలను చైతన్యవంతుల్ని చేసే దిశగా యాత్ర జరుగుతుందన్నారు. అన్ని విభాగాలను సమన్వయం చేసి జోడోయాత్రను విజయవంతం చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు.
Next Story