Sun Dec 29 2024 02:06:10 GMT+0000 (Coordinated Universal Time)
బీజేపీ, టీఆర్ఎస్ తోడు దొంగలే
ప్రజా సమస్యలపై కాంగ్రెస్ నిరంతరం పోరాటం చేస్తుందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.
ప్రజా సమస్యలపై కాంగ్రెస్ నిరంతరం పోరాటం చేస్తుందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. చౌటుప్పల్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీకి రాముడి కంటే కేసీఆర్ ఎక్కువయ్యాడని అన్నారు. ప్రతిపక్ష పార్టీలను నిర్వీర్యం చేయడానికి టీఆర్ఎస్ ప్రయత్నిస్తుందన్నారు. గెలిచిన ప్రతపక్షాలకు చెందిన నేతలను తన పార్టీలో చేర్చుకునేందుకు కుట్రలు చేస్తున్నారన్నారు. మునుగోడు అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీనే గెలిపించాలని రేవంత్ రెడ్డి కోరారు.
దళిత బంధు పథకాన్ని...
ఎస్ఎల్బీసీని పూర్తి చేయకుండా కేసీఆర్ ఈ ప్రాంత అభివృద్ధిని అడ్డుకున్నారన్నారు. దిండి ప్రాజెక్టు లేకపోయినందునే మునుగోడు ప్రజలకు అన్యాయం జరిగిందన్నారు. వంద రోజుల సమయం ఉంది కాబట్టి పేదలందరికీ మునుగోడులో డబుల్ బెడ్ రూంలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. దళితబంధు పథకాన్ని మునుగోడులో అందరికీ వర్తింప చేయాలన్నారు. ముంపు భాధితులకు తక్షణ సాయం చేయాలని రేవంత్ రెడ్డి కోరారు. కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి తో పాటు వెళ్లిన ఎంపీపీలు, సర్పంచ్ లు కూడా రాజీనామా చేయాలని ఆయన కోరారు. కేసీఆర్, బీజేపీలు రెండు తోడు దొంగలేనని ఆయన ఆరోపించారు
Next Story