Thu Nov 28 2024 05:50:27 GMT+0000 (Coordinated Universal Time)
ఆ అధికారులనూ మార్చాల్సిందే : రేవంత్
తెలంగాణలో బీఆర్ఎస్ అనుకూల ఐఏఎస్, ఐపీఎస్‌లు ఇంకా ఉన్నారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు
తెలంగాణలో బీఆర్ఎస్ అనుకూల ఐఏఎస్, ఐపీఎస్‌లు ఇంకా ఉన్నారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. డీజీపీ అంజన్ కుమార్ తో పాటు మరో పోలీసు ఉన్నతాధికారి స్టీఫెన్ రవీంద్రలు కాంగ్రెస్‌లో చేరకుండా కొందరు నేతలను బెదరిస్తున్నారని ఆరోపించారు. వారిపై కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని ఆయన తెలిపారు. బీఆర్ఎస్ కు పరోక్షంగా సహకరించేందుకు ఐఏఎస్, ఐపీఎస్‌లు వ్యవహరిస్తున్నారని ఆయన నేరుగా విమర్శలు చేశారు.
ఫండ్ ను సమకూర్చే...
ఐఏఎస్ అధికారులు అరవింద్‌కుమార్, జయేష్ రంజన్లు బీఆర్ఎస్ కు పార్టీ ఫండ్ తెచ్చేలా కృషి చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అధికారుల పని పడతామని ఆయన హెచ్చరించారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పక్షపాతంతో వ్యవహరిస్తూ అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని, వారిపై త్వరలోనే ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయనున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. ఎవరూ అధికారులకు భయపడాల్సిన పనిలేదని రేవంత్ పిలుపునిచ్చారు.
Next Story