Thu Dec 19 2024 17:09:17 GMT+0000 (Coordinated Universal Time)
నేడు మునుగోడుపై కాంగ్రెస్ కీలక భేటీ
నేడు మునుగోడుపై గాంధీభవన్ లో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించనున్నారు
నేడు మునుగోడుపై గాంధీభవన్ లో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో అభ్యర్థి ఎంపిక పై ఒక నిర్ణయానికి రానున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యంగా మారుతోంది. అయితే సాధారణ ఎన్నికలకు ముందు జరుగుతున్న మునుగోడు ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకం కావడంతో కాంగ్రెస్ ముందుగానే అభ్యర్థిని ప్రకటించి ప్రచారంలోకి దిగాలని కాంగ్రెస్ భావిస్తుంది.
టిక్కెట్ ఆశిస్తున్న....
అందుకోసం ఈరోజు గాంధీ భవన్ లో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు, మధుయాష్కి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కమిటీ హాజరుకానుంది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో పాటు ఈ ఎన్నికల్లో టిక్కెట్ ఆశిస్తున్న పాల్వాయి స్రవంతి, వున్న కైలాష్, పల్లె రవికుమార్, చిలుముల కృష్ణారెడ్డి లకు ఆహ్వానం అందాయి. ఈ సమావేశంలో అభ్యర్థి నిర్ణయం ఖరారు కాకపోయినా వీరిలో ఇద్దరి పేర్లను అధిష్టానానికి పంపే అవకాశాలున్నాయి.
Next Story