Wed Apr 23 2025 06:00:14 GMT+0000 (Coordinated Universal Time)
నేడు పెద్దగట్టు జాతర.. జాతీయ రహదారిపై ఆంక్షలు
సూర్యాపేట జిల్లాలో నేడు పెద్దగట్టు జాతర జరగనుంది.విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆంక్షలు విధించారు.

సూర్యాపేట జిల్లాలో నేడు పెద్దగట్టు జాతర జరగనుంది. ధూరజ్ పల్లి పెద్దగట్టుకు దేవరపెట్టే జాతర నేటి నుంచి ప్రారంభం కానుండటంతో జాతీయ రహదారిపై ఆంక్షలు విధించారు. ఈ పెద్దగట్టు జాతరకు దాదాపు ఇరవై ఐదు లక్షల మంది హాజరయ్యే అవకాశముంది. జాతర నేపథ్యంలో విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆంక్షలు విధించారు.
విజయవాడ నుంచి వచ్చే...
విజయవాడ నుంచి వచ్చే వాహనాలను అద్దంకి నార్కెట్ పల్లి రోడ్డు మీదుగా మళ్లిస్తున్నారు. ఈ జాతరకు ఐదు కోట్ల రూపాయలు ప్రభుత్వం విడుదల చేసింది. రెండు రోజుల పాటు జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే భక్తులు లింగమంతుల స్వమి జాతర లో పాల్గొననున్నారు. లక్షలాది మంది భక్తులు జాతరకు వస్తుండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రెండు రోజుల పాటు ఈ జాతర జరగనుంది.
Next Story