Mon Dec 23 2024 08:49:55 GMT+0000 (Coordinated Universal Time)
నేడు హైదరాబాద్ కు ప్రధాని రాక.. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
ప్రధాని పర్యటన నేపథ్యంలో సైబరాబాద్ పరిధిలో మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ట్రాఫిక్ ఆంక్షలు అమలు..
హైదరాబాద్ : ప్రధాని నరేంద్రమోదీ నేడు హైదరాబాద్ కు రానున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో నగరంలో పటిష్టమైన ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. నేడు జరిగే ఐఎస్ బీ ద్విదశాబ్ది వార్షికోత్సవాల్లో మోదీ పాల్గొననున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఐఎస్ బీతో పాటు బేగంపేట విమానాశ్రయం, హెచ్ సీయూలలో భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. ఐఎస్ బీలో 2 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ప్రధాని పర్యటన నేపథ్యంలో సైబరాబాద్ పరిధిలో మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి. లింగంపల్లి నుంచి గచ్చిబౌలికి వచ్చే వాహనదారులు హెచ్ సీయూ నుంచి డిపో వద్ద లెఫ్ట్ తీసుకుని మసీదు బండ కమాన్ వద్ద లెఫ్ట్ టర్న్ తీసుకుని కొండాపూర్ ఏరియా ఆస్పత్రి, బొటానికల్ గార్డెన్ వద్ద రైట్ టర్న్ తీసుకుని గచ్చిబౌలికి రావాల్సి ఉంటుంది. అలాగే విప్రో జంక్షన్ కు వెళ్లే వారు క్యూసిటీ, గౌలి దొడ్డి, గోపన్నపల్లి ఎక్స్ రోడ్డు మీదుగా హెచ్ సీయూ బ్యాక్ గేట్ నుంచి నల్లగుండ్ల మీదుగా లింగంపల్లికి చేరుకోవాలి.
విప్రో జంక్షన్ నుంచి గచ్చిబౌలి వెళ్లాల్సిన వాహనదారులు ఫెయిర్ ఫీల్డ్ హోటల్, నానక్ రామ్ గూడ రోటరీ, ఓఆర్ఆర్ మీదుగా ఎల్ అండ్ టీ టవర్స్ ద్వారా గచ్చిబౌలి చేరుకోవాలి. కేబుల్ బ్రిడ్జి మీదుగా గచ్చిబౌలికి వెళ్లాల్సిన వాహనదారులు.. కేబుల్ బ్రిడ్జి అప్లమ్ రోడ్డు నంబర్-45, మాదాపూర్ రత్నదీప్, మాదాపూర్ పోలీస్ స్టేషన్, సైబర్ టవర్స్, హైటెక్స్, కొత్తగూడ, బొటానికల్ గార్డెన్ ద్వారా గచ్చిబౌలి జంక్షన్ చేరుకోవచ్చు. గచ్చిబౌలి జంక్షన్ నుంచి లింగంపల్లి వెళ్లే వాహనదారులు గచ్చిబౌలి జంక్షన్ వద్ద రైట్ టర్న్ తీసుకొని బొటానికల్ గార్డెన్ వద్ద లెఫ్ట్ తీసుకొని కొండాపూర్ ఏరియా ఆస్పత్రి, మసీద్ బండ, మసీద్ బండ కమాన్, హెచ్సీయూ డిపో రోడ్డు మీదుగా లింగంపల్లికి వెళ్లాల్సి ఉంటుంది.
Next Story