Mon Dec 15 2025 03:55:21 GMT+0000 (Coordinated Universal Time)
గద్దర్ భార్యకు ప్రధాని మోదీ లేఖ
గద్దర్ భార్య గుమ్మడి విమలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లేఖ రాశారు.

గద్దర్ భార్య గుమ్మడి విమలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లేఖ రాశారు. గద్దర్ మృతి గురించి తెలుసుకుని చాలా బాధపడ్డానని లేఖలో పేర్కొన్నారు. తీవ్ర దుఃఖంలో ఉన్న ఈ సమయంలో కుటుంబ సభ్యులకు హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నట్లు వెల్లడించారు. గద్దర్ పాటలు, ఇతివృత్తాలు సమాజంలోని బడుగు బలహీన వర్గాలు ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రతిబింబిస్తాయని.. ఆయన రచనలు ప్రజలకు ప్రోత్సాహాన్ని కూడా అందించాయని కొనియాడారు. తెలంగాణ సాంప్రదాయక కళారూపాన్ని పునరుజ్జీవింపజేయడంలో ఆయన చేసిన కృషి ప్రజలకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని పేర్కొన్నారు. మీ దుఃఖాన్ని మాటల్లో వ్యక్తపరచలేమని.. కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు ఈ దుఃఖాన్ని తట్టుకునే శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు లేఖ ద్వారా తెలియజేశారు.
Next Story

