Thu Dec 19 2024 16:44:55 GMT+0000 (Coordinated Universal Time)
రేవంత్ రెడ్డికి ప్రధాని హామీ ఇచ్చేశారుగా!!
తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి ప్రధాని
తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి ప్రధాని నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఇంగ్లిష్, తెలుగు భాషలలో ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. తెలంగాణకు అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. 'తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి అభినందనలు. రాష్ట్ర ప్రగతికి, పౌరుల సంక్షేమానికి అన్ని విధాలా తోడ్పాటు అందిస్తానని నేను హామీ ఇస్తున్నాను' అంటూ ట్వీట్ చేశారు.
తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ రేవంత్ చేత ప్రమాణ స్వీకారం చేశారు. రేవంత్ తో పాటు మరికొందరు నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. రేవంత్ రెడ్డి దైవ సాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు. రేవంత్ అనే నేను అని అనగానే ఎల్బీ స్గేడియం మొత్తం రేవంత్ జిందాబాద్ అనే నినాదంతో మారుమోగిపోయింది. మంత్రులుగా భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర రాజనర్సింహ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీతక్క, జూపల్లి కృష్ణారావులు ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు.
Next Story