Sat Nov 23 2024 22:46:25 GMT+0000 (Coordinated Universal Time)
రేపు మోదీతో కార్పొరేటర్ల సమావేశం
రేపు బీజేపీ కార్పొరేటర్లతో ప్రధాని మోదీ ఢిల్లీలో సమావేశం కానున్నారు. నేడు కార్పొరేటర్లు ఢిల్లీ బయలుదేరి వెళుతున్నారు
ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ భారతీయ జనతా పార్టీ తెలంగాణపై ఫోకస్ పెంచింది. నేరుగా ప్రధాని మోదీ రంగంలోకి దిగారు. రేపు జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో ప్రధాని మోదీ ఢిల్లీలో సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి హాజరు కావడానికి నేడు బీజేపీ కార్పొరేటర్లు ఢిల్లీ బయలుదేరి వెళుతున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోదీ బీజేపీ జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో సమావేశం కానున్నారు.
వచ్చే ఎన్నికల్లో....
జంట నగరాల్లో దాదాపు 18 వరకూ అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఈ నియోజకవర్గాల్లో బీజేపీ గెలుపునకు కార్పొరేటర్లు ఇప్పటి నుంచే కృషి చేయాల్సి ఉంది. ప్రజల్లో మమేకమై వారిని పార్టీ వైపు మళ్లించాల్సి ఉంది. దీంతో పాటు ఇటీవల హైదరాబాద్ కు వచ్చిన మోదీ కార్పొరేటర్లతో సమావేశం కావాల్సి ఉన్నా రద్దయింది. దీంతో వారికి పిలుపు వచ్చింది. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ లో బీజేపీకి 47 మంది కార్పొరేటర్లు ఉన్ానరు. వీరితో పాటు హైదరాబాద్ జంటనగరాలకు చెందిన అధ్యక్షులు కూడా మోదీతో జరిగే సమావేశంలో పాల్గొననున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ లు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు.
Next Story