Mon Dec 23 2024 17:53:52 GMT+0000 (Coordinated Universal Time)
నోవాటెల్ లోకి వెళ్లడం కష్టమే
దేశ ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా పోలీసులు విస్తృత బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు.
దేశ ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా పోలీసులు విస్తృత బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. మూడు రోజుల పాటు మోదీ నగరంలో ఉండనున్నారు. ఇప్పటికే మూడు కమిషనరేట్ల పరిధిలో 144వ సెక్షన్ విధించారు. ఇక ప్రధాని మోదీ బస చేసే నోవాటెల్ హోటల్ వద్ద నాలుగు అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఎస్పీజీ బృందం ఎప్పటికప్పుడు స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకుంటుంది. ప్రధాని బస చేసే నోవాటెల్ నుంచి ఆయన పర్యటించే ప్రాంతాలను ఎస్పీజీ తమ అధినంలోకి ఇప్పటికే తీసుకుంది. అక్కడ పాస్ లు లేనిదే ఎవరినీ అనుమతించరు.
నాలగంచెల భద్రత...
ప్రధాని చుట్టూ వలయంలా భద్రతా దళాలు కాపలా కాయనున్నాయి. ఎస్పీజీ ఫోర్స్ తో పాటు ఇంటలిజెన్స్ వింగ్, సాయుధ బెటాలియన్ దళాలు ఉండనుననాయి. బ్లూ బుక్ గైడ్ లైన్స్ ప్రకారం ప్రధాని భద్రతా ఏర్పాట్లను చేస్తున్నారు. రేపు ప్రధాని మోదీ ప్రత్యేక విమానంలో బేగంపేటకు చేరుకుంటారు. నోవాటెల్ కు వెళ్లి అక్కడి నుంచి హెచ్ఐసీసీలో జరిగే జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొంటారు. మూడో తేదీన ఎన్టీఆర్ గ్రౌండ్స్ లో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు. నాలుగో తేదీన ఇక్కడి నుంచే ఆంధ్రప్రదేశ్ కు వెళతారు. ప్రధాని హైదరాబాద్ పర్యటన సందర్భంగా భారీ భద్రత ఏర్పాట్లు చేశారు.
Next Story