Thu Mar 27 2025 09:44:47 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్, కౌశిక్ రెడ్డి అరెస్ట్
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్ రావు, కౌశిక్ రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్ రావు, కౌశిక్ రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు. కౌశిక్ రెడ్డి ఇంటికి వచ్చిన హరీశ్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో సీఐ విధులకు ఆటంకం కలిగించారన్న కారణంతో కౌశిక్ రెడ్డిపై నిన్న కేసు నమోదయింది. దీంతో ఈరోజు ఉదయాన్నే పోలీసులు కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు.
ఇంటికి వచ్చిన...
అయితే విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నేత హరీశ్ రావు కౌశిక్ రెడ్డి ఇంటికి వచ్చారు. పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా తరలి వచ్చారు. దీంతో పోలీసులు కౌశిక్ రెడ్డి, హరీశ్ రావులను అరెస్ట్ చేసి వాహనంలో పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసే అవకాశమున్నట్లు పోలీసులు తెలిపారు. అక్కడ ఉద్రిక్తత తలెత్తకుండా ముందుగానే అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
Next Story