Fri Dec 20 2024 14:28:21 GMT+0000 (Coordinated Universal Time)
మరోసారి షర్మిల అరెస్ట్
సోమాజిగూడలో వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు
సోమాజిగూడలో వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రగతి భవన్ ముట్టడికి వెళుతున్న షర్మిల, వైఎస్సార్టీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న టీఆర్ఎస్ కార్యకర్తల దాడిలో పగిలిన కారులోనే వైఎస్ షర్మిల ప్రగతి భవన్ కు వెళ్లారు. స్వయంగా షర్మిల ఆ కారును నడుపుకుంటూ వెళ్లారు.
అదే కారులో...
తమను అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ షర్మిల ఆరోపిస్తున్నారు. వైఎస్సార్టీపీ కార్యకర్తలు పెద్దసంఖ్యలో తరలి రావడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. తమపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలంటూ వైఎస్సార్టీపీ కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దీంతో పంజాగుట్టలో ఉద్రిక్తత నెలకొంది.
Next Story