Mon Dec 23 2024 06:02:55 GMT+0000 (Coordinated Universal Time)
రాజాసింగ్ పై కేసు నమోదు
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై పోలీసు కేసు నమోదయింది. కేంద్ర ఎన్నికల కమిషన్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై పోలీసు కేసు నమోదయింది. కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళహాట్ పోలీస్ స్టేషన్ లో రాజాసింగ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల సందర్భంగా రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది. ఆయన వ్యాఖ్యలు శాంతిభద్రతలకు ఇబ్బంది కలిగించే విధంగా ఉన్నాయని కేంద్ర ఎన్నికల కమిషన్ అభిప్రాయపడింది.
వివరణ ఇవ్వకపోవడంతో....
దీనిపై రాజాసింగ్ ను ఎన్నికల కమిషన్ వివరణ కోరింది. గడువులోపు రాజాసింగ్ వివరణ ఇవ్వకపోవడంతో ఆయనపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. తెలంగాణ ఎన్నికల కమిషన్ సూచన మేరకు రాజాసింగ్ పై పోలీసు కేసు నమోదు చేశామని మంగళహాట్ పోలీసులు తెలిపారు.
- Tags
- raja singh
- bjp
Next Story