Mon Dec 23 2024 13:34:58 GMT+0000 (Coordinated Universal Time)
Rahul Gandhi : రేపు మేడిగడ్డకు రాహుల్
రాహుల్ గాంధీ హెలికాప్టర్ ల్యాండింగ్ కు పోలీసులు అనుమతివ్వలేదు. రేపు మేడిగడ్డ బ్యారేజీని పరిశీంచేందుకు వెళ్లాలనుకున్నారు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హెలికాప్టర్ ల్యాండింగ్ కు పోలీసులు అనుమతివ్వలేదు. రేపు మేడిగడ్డ బ్యారేజీని పరిశీంచేందుకు రాహుల్ వెళ్లాలని నిర్ణయించారు. ఇందుకోసం హెలికాప్టర్ ల్యాండింగ్ అనుమతిని అక్కడ నేతలు కోరగా పోలీసులు నిరాకరించారు. మేడిగడ్డ బ్యారేజీ ఇటీవల కుంగిపోయిన సంగతి తెలిసిందే. రాహుల్ గాంధీ కూడా పదే పదే తన ప్రసంగాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆరోపిస్తూ వస్తున్నారు.
అంబటిపల్లిలో మహిళ సదస్సుకు...
దీంతో ఆయన తన తెలంగాణ పర్యటనను ఒకరోజు పొడిగించుకున్నారు. ఈరోజుతో రాహుల్ తెలంగాణ పర్యటన ముగిసింది. అయితే పార్టీ నిర్ణయం మేరకు రేపు మేడిగడ్డ ప్రాజెక్టును రాహుల్ సందర్శించాలనుకున్నారు. ఆ పక్కనే ఉన్న అంబటిపల్లిలో జరగనున్న మహిళ సదస్సుకు కూడా హాజరు కావాలని నిర్ణయించుకున్నారు. అక్కడి నుంచి నేరుగా మేడిగడ్డ కు వెళ్లాలన్నది కాంగ్రెస్ నేతల ఆలోచన. హెలికాప్టర్ ద్వారా అయితే గంట సమయం పడుతుంది. అదే రోడ్డు మార్గాన నాలుగు గంటలకు పైగానే సమయం పడుతుంది. మరి రాహుల్ రోడ్డు మార్గాన వెళతారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది. పూర్తి వివరాలు ఇంకా అందవలసి ఉంది.
Next Story