Sat Jan 11 2025 06:23:52 GMT+0000 (Coordinated Universal Time)
Raj Tarun : రాజ్ తరుణ్‌కు పోలీసులు నోటీసులు
సినీనటుడు రాజ్‌తరుణ్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 18వ తేదీ లోపు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు
సినీనటుడు రాజ్‌తరుణ్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 18వ తేదీ లోపు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. హీరో రాజ్ తరుణ్ తనను నమ్మించి పెళ్లి చేసుకుని మోసం చేశాడంటూ లావణ్య అనే యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ మేరకు నోటీసులు జారీ చేశారు. నటి మాల్వీ మల్హోత్రా పరిచయం అయిన తర్వాత రాజ్ తరుణ్ తనను దూరం పెట్టాడంటూ లావణ్య పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
డ్రగ్స్ కేసులోనూ ఇరికించి...
తనను డ్రగ్స్ కేసులో కూడా ఇరికించాడని, తాను 43 రోజుల పాటు జైలులో ఉండాల్సి వచ్చిందని ఆమె తెలిపారు. అయితే దీనికి సంబంధించిన ఆధారాలు ఇవ్వాలంటూ లావణ్యను పోలీసులు కోరారు. ఆమె తన వద్ద ఉన్న ఆధారాలను నార్సింగ్ పోలీసులకు ఇచ్చింది. దీంతో రాజ్ తరుణ్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు.
Next Story