Mon Dec 23 2024 12:11:16 GMT+0000 (Coordinated Universal Time)
అగ్ని ప్రమాదానికి అసలు కారణమిది
సికంద్రాబాద్ క్లబ్ లో అగ్ని ప్రమాదంపై పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. క్లూస్ టీం కొన్ని కీలక ఆధారాలను సేకరించింది
సికంద్రాబాద్ క్లబ్ లో అగ్ని ప్రమాదంపై పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. క్లూస్ టీం కొన్ని కీలక ఆధారాలను సేకరించింది. యాభై వేల చదరపు అడుగుల్లో క్లబ్ ఉంది. క్లబ్ ఇంటీరియర్ అంతా టేకుతో చేశారు. విలువైన మద్యం కూడా ఉంది. వర్షం కురుస్తుండటంతో విద్యత్తును క్లబ్ సిబ్బంది నిలిపివేశారు. అయితే జనరేటర్ ఆటోమేటిక్ గా ఆన్ కావడంతో షార్ట్ సర్క్యూట్ అయిఉంటుందని అనుమానిస్తున్నారు.
25 కోట్ల ఆస్తి నష్టం...
ఈ ప్రమాదంలో దాదాపు 25 కోట్ల ఆస్తి నష్టం సంభవించింది. కలప ఉండటంతో మంటలు వేగంగా వ్యాప్తి చెందాయి. మూడు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. కమిటీ సభ్యుల మధ్య కొన్ని రోజులుగా వివాదాలు ఉన్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రమాద తీవ్రతను దాచేందుకు క్లబ్ యాజమాన్యం ప్రయత్నిస్తుందన్న విమర్శలు విన్పిస్తున్నాయి. దీనిపై ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది.
Next Story