Sun Dec 22 2024 08:01:52 GMT+0000 (Coordinated Universal Time)
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కు లుక్ అవుట్ నోటీసులు
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ పై పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ పై పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ప్రగతి భవన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదానికి కారణమైన తన కుమారుడిని తప్పించారని షకీల్పై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. రహేల్ దుబాయ్ పారిపోవడానికి షకీల్ సహకరించారని పోలీసులు తమ దర్యాప్తులో తేల్చారు.
రోడ్డు ప్రమాదానికి సంబంధించి...
అయితే షకీల్ పై తాజాగా తెలంగాణ పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. షకీల్ 2018 ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి బోధన్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రగతి భవన్ రోడ్డు ప్రమాదం కేసును తిరగదోడింది. ఈ నేపథ్యంలో ఆయనకు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.
Next Story