Mon Dec 23 2024 00:28:26 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : బాల్క సుమన్ పై పోలీసు కేసు నమోదు
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ పై పోలీసులు కేసు నమోదు చేశారు
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ నేతలు ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అసభ్య పదజాలం వాడడంతో పాటు బెదిరింపులకు దిగడంతో 294B, 504, 506 సెక్షన్ల కింద కేసు పోలీసులు నమోదు చేశారు. మంచిర్యాల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.
రేవంత్ పై చేసిన వ్యాఖ్యలు...
రెండు రోజుల క్రితం బాల్కసుమన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ సుమన్ విమర్శలు చేయడంతో కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రికి సమావేశంలో చెప్పు చూపించడాన్ని సీరియస్ గా తీసుకున్న కాంగ్రెస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై కేసు నమోదు చేశారు.
Next Story